Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ - సూర్యాపేట
జీవితం ఎంతో విలువైందని, పిల్లలు తల్లిదండ్రులకు కడుపుకోత విధించొద్దని ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూచించారు. బుధవారం స్థానిక పోలీసు స్టేషన్లో గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన పలువురికి కౌన్సిలింగ్ నిర్వహించారు. గంజాయితో జీవితాలు, సమాజం నాశనం అవుతుందన్నారు. గంజాయిని ఎవరూ రవాణా చేయొద్దని, వినియోగించొద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మోహన్‌కుమార్, పట్టణ సీఐ ఆంజనేయులు, ఎస్సైలు శ్రీనివాస్, బాసు, నరేందర్, టెక్ టీమ్ కర్ణాకర్, కృష్ణ, సైదులు తదితరులు పాల్గొన్నారు.