Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట
నల్లగొండలోని ఎంజీ యూనివర్శిటీ లో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనాల పెంపునకు కృషి చేసిన యూనివర్శిటీ పాలక మండలి సభ్యులు నాతి సవీందర్కుమార్ను బుధవారం ఎంజీయు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు సన్మానించారు. ఈ సందర్భంగా సవీందర్ మాట్లాడుతూ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనాల గురించి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పత్తి శివశంకర్, గంగుల మారేశ్వర్రావు, శాంతపూరి శంకర్రావు, మట్టిపల్లి రాంచందర్, పల్నాటి దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.