Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి
నవతెలంగాణ-పెన్‌పహాడ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేశాయని టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి విమర్శించారు. మండలంలోని లింగాల గ్రామంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు బచుపల్లి నాగేశ్వరరావు, గ్రామశాఖ అధ్యక్షులు సురభి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు రణపంగ వెంకన్న ఆధ్వర్యంలో 300 మంది ఇతర పార్టీలకు చెందిన వారు బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితబంధు పేరుతో ప్రజలు మభ్యపెడుతున్నారన్నారు. రబ్బర్ చెప్పులు కూడా లేని జగదీశ్‌రెడ్డి ఈ రోజు రోల్స్రాయిజ్ కార్లలో తిరిగేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగరాజు, బెల్లంకొండ శ్రీరాములు, దొంగరి గోపి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.