Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
- సీపీఐ(ఎం) యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ-మోత్కూరు
టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజకీయ అవసరాలు తప్పితే రైతాంగ సమస్యలు పట్టడం లేదని సీపీఐ(ఎం) యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ విమర్శించారు. డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించే ఆ పార్టీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం మున్సిపల్ కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి ఎదురుచూస్తున్నారన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం హుజూరాబాద్ ఉప ఎన్నికపై దష్టి పెట్టి రైతులను, ప్రజలను గాలికొదిలేశారన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తక్కువ ధరకు దళారులు, వ్యాపారులకు అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పెట్టిన పెట్టుబడులు చేతికి రాక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగిలో రైతులు వరి వేయవద్దని ప్రభుత్వం చెబుతుందని, ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని చెబుతున్న ప్రభుత్వంఅందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జిల్లా మహాసభల విజయవంతం చేసేందుకు పార్టీకార్యకర్తలు, అనుబంధ సంఘాలు కషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి, పట్టణ కార్యదర్శి కూరపాటి రాములు, నాయకులు చేతరాశి నర్సింహ, లెంకల యాదగిరి, గుజ్జ శ్రీను తదితరులు పాల్గొన్నారు.