Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్
నవతెలంగాణ - తుంగతుర్తి
మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్రావుతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కోరారు. మండలంలో బీటీ, మెటల్ రోడ్లకు ప్రతిపాదనలు పంపామని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మిషన్ భగీరథ పనులు త్వరగా పూర్తి చేసి అన్ని గ్రామాలకూ తాగు నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పీడీ కిరణ్ కుమార్, డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ పులుసు యాదగిరిగౌడ్, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలంయాదవ్, ఎంపీడీవో లక్ష్మి, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పలువురు లబ్దిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మీ చెక్కులను బుధవారం ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దీపిక యుగంధర్‌రావు, ఎంపీపీ గుండగాని కవితా రాములు గౌడ్, డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పులుసు యాదగిరిగౌడ్, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలంయాదవ్, ఎంపీటీసీ చెరుకు సృజన పరమేష్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు నల్లు రాంచంద్రారెడ్డి, తహసీల్దార్ రాంప్రసాద్ప్రసాద్, ఎంపీడీవో లక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ సూరారపు పుష్ప, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రవీందర్‌రెడ్డి, మహమ్మద్ అలీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాడికొండ సీతయ్య, ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ దొంగరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.a