Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
లాభదాయక ప్రత్యామ్నాయ పంటలపై రైతులు ఆలోచన చేయాలని డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని కాచారం గ్రామంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం పాడి పరిశ్రమను అభివద్ధి చేయడానికి ఎంతగానో కషి చేస్తుందన్నారు. పశువులకు సోకే సీజనల్ వ్యాధులను నివారించడానికి సకాలంలో టీకాలను, వాక్సీన్స్ అందించడంలో ముందుందన్నారు. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు ఎంతగానో ఉపయోగపడే ఇటువంటి ఉచిత పశు వైద్య శిబిరం కార్యక్రమం చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని అదే విధంగా ఇప్పుడు కూడా కొనుగోలు చేస్తునందని, రైతులు ఆందోళన చెందొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్ ,యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం ,జెడ్పీటీసీ ి తోటకూరి అనురాధ బిరయ్య, సర్పంచ్ అరుణ అశోక్ ,యాదగిరిగుట్ట పీఏసీఎస్ చైర్మెన్్ ఈమ్మడి రామ్ రెడ్డి,మదర్ డైరీ డైరెక్టర్ కల్లేపల్లి శ్రీశైలం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు బూడిద ఐలయ్య, మామిడాల నర్సింహులు,అలివేలు , కాచారం రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం చైర్మెన్, పశు వైద్యాధికారులు పాల్గొన్నారు.