Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా
భూదాన్‌పోచంపల్లి: ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోం దని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ విమర్శించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో పోచంపల్లి సింగిల్ విండో మార్కెట్ సొసైటీ కేంద్రంలో అకాల వర్షానికి తడిసి ధాన్యాన్ని బుధవారం పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ మార్కెట్లోకి 310మంది రైతులు ధాన్యం తీసుకొచ్చి నెలరోజులైందన్నారు. అకాల వర్షానికి ధాన్యం తడవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారన్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో కంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగో లు చేస్తుంటే జిల్లాలో ఎందుకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏ రోజు ప్రారంభిస్తారో కలెక్టర్ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. సీనియర్ నాయకులు గూడూరు అంజి రెడ్డి మాట్లాడుతూ గతేడాది కూడా ధాన్యం వెంటనే కొనుగోలు చేయకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ కార్యక్రమంతో ఆ పార్టీ మం డల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోట రామచంద్రారెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు, పట్టణ కమిటీ సభ్యులు పగడాల శివ , దుబ్బాక జగన్, రామస్వామి అనిల్ రెడ్డి, రైతులు బతుక మల్లయ్య, కేసారం మల్లారెడ్డి, నోముల నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.