Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
రియల్ ఎస్టేట్ రంగంలో రెండు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 వెంచర్లను అభివద్ధి చేసి కస్టమర్లకు అందించి రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుగొందారు శ్రీనివాసరాజు. నేడు ఆయన 56వ పుట్టినరోజు సందర్భంగా బుధవారం నవతెలంగాణతో మాట్లాడారు.
రియల్ ఎస్టేట్ రంగంలో
రెండు దశాబ్దాల అనుభవం..
రియల్ ఎస్టేట్ రంగంలో తనకున్న రెండు దశాబ్దాల అనుభవంతో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, భువనగిరి, ఘట్కేసర్, మేడ్చెల్ ,చెంగిచెర్ల, బీబీనగర్, యాదగిరిగుట్ట ప్రాంతాలలో సుమారు 20 వెంచర్లను కస్టమర్లకు అందుబాటులోకి ఉండేలా అభివద్ధి చేశారు. రెండు దశాబ్దాలుగా విశిష్ట ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో కస్టమర్లకు సేవలందిస్తున్నారు.
2011లో విశిష్ట ఇన్ ఫ్రా డెవలపర్స్
కంపెనీ ప్రారంభం
చింతలపాటి శ్రీనివాసరాజు 2011వ సంవత్సరంలో విశిష్ట ఇన్ ఫ్రా డెవలపర్స్ పేరుతో కంపెనీ ప్రారంభించారు. తన మొదటి వెంచర్ ను చెంగి చర్ల ఈ ప్రాంతంలో ధరణి ఎన్ క్లేవు పేరుతో ఐదు ఎకరాల లో వెంచర్ డెవలప్ చేశారు. రెండో వెంచర్ కీసర, మూడో వెంచర్ పటాన్ చేరు లో అభివద్ధి చేస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలను పొందారు. కస్టమ ర్లకు నమ్మకంతో ఘట్కేసర్, కొండమడుగు, బీబీనగర్, రాయగిరి మోత్కూర్ రోడ్లో అనేక వెంచర్లను అభివద్ధి చేశారు. యాదగిరి గుట్టలో యాదాద్రి మెడోస్ పేరుతో మెగా వెంచర్లు ప్రారంభించారు. విశిష్ట ఇన్ ఫ్రా కంపెనీలో సుమారు 100 మంది ఉపాధి పొందుతున్నారు.
సాహిత్య రంగానికి శ్రీనివాసరాజు సేవ...
సాహిత్యరంగంలో తనకున్న అభిమానంతో కవులు, రచయితలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారు. సుమారు రెండు దశాబ్దాల పాటు గా సాహితీరంగంలో కవులు, రచయితలను ప్రోత్సహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తేజస్విని కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాహితీ రంగం వారికి సేవలు అందిస్తున్నారు. సాహితీ రంగం వారికి సేవలు అందించినందుకు గాను చింతలపాటి శ్రీనివాస రాజు కు 2018 సంవత్సరంలో ఆగస్టు 29వ తేదీన సేవారంగంలో జమున ప్రతిష్టాత్మక జీవన సాఫల్య పురస్కారం అవార్డును ప్రధానం చేశారు. అవార్డుతోపాటు పదుల సంఖ్యలో ఆయనకు చేసిన సేవలకుగాను అవార్డులు లభించాయి.
కస్టమర్ల అభివద్ధి మా ద్యేయం...
తన కంపెనీలో ప్రతి కస్టమర్ తనకు ఒక కుటుంబ సభ్యులు ఇలాంటి వాళ్ళని వాళ్ళ అభివద్ధి మా కుటుంబ అభివద్ధి అనే విధంగా పని చేస్తున్నట్లు తెలిపారు. మా కుటుంబ సభ్యుల (కస్టమర్ల) ఇచ్చిన ప్రోత్సాహం తో సుమారు 20 వెంచర్ లను అభివద్ధి చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో కూడా కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా మెగా ప్రాజెక్టు వెంచర్లు నిర్వహించి వారి అభివద్ధికి కషి చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు తన వెన్నంటి ఉండి, తనకు సహకరించిన మార్కెటింగ్ మిత్రులు, కస్టమర్లకు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.