Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి స్వామివారి (జన్మ నక్షత్రం) స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామి వారికి శతఘటాభిషేకం శుక్రవారం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళాశాలలో జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు,పెరుగు తో వేదమంత్రలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. ఈ పూజలో స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఊంజలీ సేవ...
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శుక్రవారం శ్రీస్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, అమ్మవారికి ఊంజల్ సేవ పర్వాలను అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచి శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించారు. ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన జరిపించి, సుగంధ ద్రవ్యాలు, శుద్ధజలం, ఫలరసాలతో అభిషేకించి, తులసీ పత్రాలతో అర్చించారు. దర్శనమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన చేపట్టారు.
పుష్పాలంకరణ సేవ...
యాదాద్రి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం శుక్రవారం శ్రీ స్వామి బాలాలయంలో పుష్పాలంకరణ సేవ దర్శనం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఇందుకోసం టికెట్ ధర రూ. 300లుగా (ఒక్కరికి) నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు.ఈ సేవలు ఉదయం 5.30 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు వరకు జరుపబడునని పేర్కొన్నారు. ఈ పూజకు సంబంధించినప్రారంభభంలో 19 టికెట్లు విక్రయం జరిగినట్లు ఆమె చెప్పారు.
భక్తుల విరాళాలు...
శ్రీ స్వామి వారి విమాన గోపురం బంగారు తాపడం నిమిత్తం హైద్రాబాద్ కు చెందిన పి వెంకట్ రెడ్డి కుటుంబ సమేతంగారూ. 2,00,516లు, అదేవిధంగా మాధవరం గోవర్ధన్ రావు, దంపతులు రూ. 5,11,116లు, స్థానిక భక్తుడు గడ్డమీది మానవులు రూ. 51,116లు శుక్రవారం ఈవో గీతకు అందజేశారు.
యాదాద్రికి సుప్రీం కోర్టు న్యాయమూర్తి...
యాదాద్రి క్షేత్రాన్ని నేడు భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి దర్శించుకుంటారని జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి శ్రీనివాస రెడ్డి నేడొక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.45 గంటలకు చేరుకొన్న అనంతరం స్వామి వారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు.