Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నార్కట్‌పల్లి
మాజీ జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య నార్కట్‌పల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ సిర్పంగి స్వామి వార్డు సభ్యులు మెడ శ్రీనివాస్‌ను కులం పేరుతో దూషించారని స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి ఎస్ఐ భీమన బోయిన యాదయ్యతో కలిసి సంఘటన జరిగిన మేజర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం విచారణ చేపట్టారు. డీఎస్సీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...నార్కట్ పల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దూదిమెట్ల శ్రవంతి ఉప సర్పంచ్ సిర్పంగి స్వామి వార్డు సభ్యులు మేడ బోయిన శ్రీనివాస్ వార్డు సభ్యురాలు భర్త సతీష్ రెడ్డిల మధ్య ఆదివారం స్థానిక గ్రామ పంచాయతీ లో సీసీ కెమెరాల ఏర్పాటు పై వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదంలో మాజీ జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య జోక్యం చేసుకొని ఉప సర్పంచ్ సిర్పంగి స్వామి, వార్డు సభ్యులను కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు. స్థానిక గ్రామ పంచాయతీ లో వాగ్వాదంలో పాల్గొన్న వ్యక్తులను జరిగిన సంఘటన వద్ద ఉన్న సాక్షులను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం దష్టిలో అందరూ సమానులే రాజ్యాంగం హక్కు ప్రకారం ఎవరికి ఎవరు కూడా దూషించడం సరైంది కాదన్నారు. చట్టం తన పని తానూ చేసుకొని పోతుందని పేర్కొన్నారు. ఈ విచారణలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కల్లూరి యాదగిరి గౌడ్ ,స్థానిక సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి ,మాజీ జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు మెడ బోయిన శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.