Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మండల సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకున్న సీపీఐ(ఎం), రైతు సంఘం నాయకులు
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని రైతు సంఘం, సీపీఐ(ఎం) నాయకులు అడ్డుకున్నారు. ఆ పార్టీ ఎంపీటీసీ, సర్పంచులు సమావేశానికి వస్తున్న ప్రజా ప్రతినిధులు వెళ్లకుండా మండల పరిషత్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద రైతులతో కలిసి బైటాయించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి ఈ నెల రోజులు గడుస్తున్నా కూడా నేటికీ ప్రభుత్వం కొనుగోలు మొదలు పెట్టకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతు సంఘాల నాయకులు చేస్తున్న ఆందోళనకు ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ ,కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు మద్దతు ప్రకటిస్తూ బైటాయించారు. సమావేశ మందిరానికి వెళ్లకుండా దాన్యం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో సమావేశానికి సకాలంలో సభ్యులు హాజరు కాకపోవడంతో కోరలేదని ప్రకటిస్తూ ఇన్చార్జి ఎంపీడీవో బాల శంకర్ సమావేశాన్ని నేటికి వాయిదా వేసినట్టు ప్రకటించారు.
-జిల్లా కలెక్టర్ ధాన్యం కొనుగోలు పై స్పష్టమైన ప్రకటన చేయాలి
బూరుగు కష్ణారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు
మండల వ్యాప్తంగా 20 కేంద్రాల్లో రైతులు ధాన్యం అని తెలిపారు. నెలలు గడుస్తున్నా కూడా దాన్యం కొనుగోలు మొదలుపెట్టక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజులు గడుస్తున్నా కూడా కొనుగోలు మొదలు పెట్టక పోవడం శోచనీయం అన్నారు. జిల్లా కలెక్టర్ రైతుల శ్రేయస్సును దష్టిలో పెట్టుకుని ఎప్పటి నుంచి కొనుగోలు ప్రారంభిస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన పట్టాలు, తూకం వేయడానికి కాంటా లను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని తెలిపారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. అనంతరం మండల పరిషత్ అధ్యక్షులు తాడూరి వెంకట్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. రైతులు ఆందోళనకు మద్దతు తెలిపిన వారిలో వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మునగాల ప్రభాకర్ రెడ్డి,సర్పంచులు కాయితీ రమేష్, కొలను శ్రీనివాస్ రెడ్డి, చక్రం జంగయ్య, పెద్దింటి హేమలత, యాదయ్య, ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బక్క శ్రీనాథ్, లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు, సింగిల్విండో మాజీ చైర్మెన్ చిరిక సంజీవరెడ్డి, ఆ పార్టీ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, ఎంపీటీసీలు చెన్నబోయిన వెంకటేశం, తడక పారిజాత, సింగిల్ విండో డైరెక్టర్ బోరెం నర్సిరెడ్డి, పార్టీ మండల కమిటీ సభ్యులు జక్కి రెడ్డి రామ్ రెడ్డి, రాగిరు కిష్టయ్య, బొజ్జ బాలయ్య, కొండే శ్రీశైలం, బోయ యాదయ్య, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎస్ కె మదార్, రైతులు యాట ముత్యాలు, నరసింహ, అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.