Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
రాజ్యాంగంలో రూపొందించిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని లొట్టపీసు చట్టం అని అహంభావంతో మాట్లాడిన ఎంపీ అరవింద్‌ను బర్తరఫ్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశం కొండేటి శ్రీను అధ్యక్షతన దొడ్డికొమరయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికీ పేదలుగా అభివద్ధికి ఆమడ దూరంలో ఉన్న దళిత, గిరిజన, మైనారిటీ బలహీనవర్గాలకు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారని, ఆ రిజర్వేషన్లను తొలగించాలనే కుట్రలు చేస్తున్నారన్నారు. దానిలో భాగంగానే అరవింద్ వ్యాఖ్యలు చేశారని అన్నారు. నేడు పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అమ్మేసి అందులో అమలయ్యే రిజర్వేషన్లను పూర్తిగా తొలగించిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు రిజర్వేషన్ల జోలికొస్తే ప్రభుత్వాలు పతనం కావడం తథ్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా లొట్టపీసు అరవింద్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రెమడాల పర్శరాములు సహాయ కార్యదర్శి జిట్ట నగేష్ గాదె నర్సింహ దైదా శ్రీను తదితరులు పాల్గొన్నారు.