Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
అమరుల త్యాగాలను పార్టీ ఎప్పటికి మరువదని సీపీ ఐ(ఎం)జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి అన్నారు.శుక్రవారం మండలంలోని కొత్తగూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ రత్నా రెడ్డి 19వ వర్థంతి సభలో ఆయన మాట్లాడారు. చిమిర్యాల కొత్తగూడెం కంకణాల గూడెం ఉమ్మడి గ్రామాల సర్పంచిగా రత్నా రెడ్డి ప్రజలకు అందించిన సేవలు అభినందనీయన్నారు.తుదివరకు రత్నారెడ్డి ఆదర్శ కమ్యూనిస్టుగా జీవించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జి శ్రీనివాస చారి, సీఐటీయూ మండల కన్వీనర్ రాచకొండ కష్ణయ్య,స్థానిక నాయకులు దోనూర్ బుచ్చిరెడ్డి,లక్ష్మారెడ్డి,భాస్కర్ రెడ్డి,నరసింహ, బజార్, అంజయ్య,పాపి రెడ్డి,నారాయణ రెడ్డి,మల్లేష్,నరసింహ పాల్గొన్నారు.