Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కేతెపల్లి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, కొనుగోలు వేగవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు డిమాండ్ చేశారు. మండలంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజులుగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి రాశుల వద్ద పడిగాపులు కాస్తున్నారని చెప్పారు.అకాల వర్షానికి ధాన్యం తడిచి రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. రాశుల పట్టాలకు, టార్పాలిన్లకు కిరాయి పెరిగి ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే వివిధ గ్రామాల్లో ఉన్న ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను దళారుల దోపిడీకి గురికాకుండా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి చింతపల్లి మారయ్య రైతు సంఘం నాయకులు కోట లింగయ్య అవ్వారి కిరణ్ ఆదిమల సుధీర్ చెరుకు సత్తయ్య చవుగోని నాగయ్య పాల్గొన్నారు.