Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ త్రిపుర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ -నల్గొండ
త్రిపురలో ముస్లిం మైనారిటీ ప్రార్ధనా స్థలాలు షాపులు నివాసాలపై మతోన్మాద దాడులను ఖండించాలని ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హాశమ్లి పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని ఎగ్ బాల్ మీనార్ దగ్గర త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ దేవ్ దిష్టిబొమ్మను ఆవాజ్ నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది రోజులుగా ఉత్తర త్రిపుర గోమతి సాహిజాల జిల్లాలో 14 మసీదుల పై అనేక షాపులు నివాసాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. త్రిపుర రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాటి నిలువరించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నదన్నారు. బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరిగిన దాడులను సాకుగా చూపి దేశంలో మైనారిటీలపై దాడులకు పాల్పడడం అత్యంత హేయమైన చర్యన్నారు. శాంతియుత వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ పట్టణ అధ్యక్షులు మహబూబ్ అలీ, కౌన్సిలర్ సమద్, కెేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎండి సలీం,సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండం పల్లి సత్తయ్య, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, ఆవాజ్ పట్టణ నాయకులు ఇక్బాల్ సాజిద్, ఎంఏఆర్ రెహమాన్, ఎండి.ఇలియాస్ పాషా, ఎండి యూనిస్, ఎండి.మసూద్, ఎంఏ బేగ్ ,మదీనా మజీద్ మౌలానా ఎండి నిజాముద్దీన్, హబీబ్, మతిన్ , కలీం ,అక్రమ్ ,వివిధ ప్రజా సంఘాల నాయకులు పో లే సత్యనారాయణ ,గాదెనరసింహ, భూతం అరుణకుమారి, కునుకుంట్ల ఉమారాణి, రెహానా,సజ్జాద్, తదితరులు పాల్గొన్నారు.