Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్
నవతెలంగాణ- నల్గొండిపాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తి స్థాయిలో కషి చేయాలని అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ కోరారు. రైతు పంట రుణాలు, ఎసీి,్స ఎస్టీ కార్పొరేషన్ ల రుణాలు, ఆర్థిక అక్షరాస్యత, ఇతర అంశాల పై శుక్రవారం డీసీసీ, డీఎల్ఆర్సీి 2వ త్రైమాసిక సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, దానికి సంబంధించిన పురొగతి తదితర అంశాల ను లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యం వివరించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 2021-22 వానాకాలం పంటకు గాను జిల్లాలో రూ.2308 కోట్ల లక్ష్యంగా నిర్ణయించగా మొదటి త్రైమాసికం సెప్టెంబర్ 30 వరకు రూ.1832.09 కోట్లు అందించి 79.38 శాతం లక్ష్యం సాధించినట్టు తెలిపారు.జిల్లా వార్షిక రుణ ప్రణాళిక వివిధ రంగాలకు రూ.7303.57 కోట్టు లక్ష్యం గా నిర్ణయించగా సెప్టెంబర్ 30 నాటికి రూ. 3603.64 కోట్లు 49.34 శాతం వివిధ రంగాలకు రుణ సహాయం అందించినట్టు తెలిపారు. రూ.485 కోట్లా 34 లక్షలు వ్యవసాయ టర్మ్ రుణం మంజూరు చేయడం లక్ష్యం కాగా సెప్టెంబర్ చివరి వరకు రైతులకు రూ.239 కోట్ల 66 లక్షల రూ.లు(49.38) రుణాలు రైతులకు అందించామని ,వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1523కోట్ల 53 లక్షలు అందించాలని లక్ష్యం కాగా రూ.663 కోట్ల 80 లక్షలు (43.57%) అందించినట్టు అధికారులు తెలిపారు.
రైతులు పంట రుణాలు రెన్యువల్ చేసుకోవాలి
రైతులు పంట రుణాలను బ్యాంక్‌లలో రెన్యువల్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. పంట రుణాలు రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల వడ్డీ చెల్లించడం వల్ల నష్టం జరుగుతుందన్నారు. రెన్యువల్ చేసుకున్నా రుణమాఫీ వస్తుందని అన్నారు. రుణాల రెన్యువల్ పై వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కలిగించాలని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరుకునేలా ప్రభుత్వం అందించే స్వశక్తి సంఘాల రుణాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై సమీక్షిస్తూ 2017-18,2018-19 సంవత్సరాలకు పెండింగ్ యూనిట్ల సంబంధించి ప్రభుత్వం సబ్సీడి విడుదల చేసి రుణాలు మంజూరు చేసి యూనిట్లను అక్టోబర్ చివరి నాటికి గ్రౌండ్ చేసేలా బ్యాంకర్లు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్యం, ఆర్బీఐ ఏజీఎం శరత్ చందు, ఎస్బీఐ ఏజీఎం విజరు కుమార్,నాబార్డ్ ఏజీఎం వినరు కుమార్, వివిధ బ్యాంకు కంట్రోలర్లు, మేనేజర్లు , మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.