Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ పమేలాసత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ఈనెల 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు స్వచ్ఛ వారోత్సవాలను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నేడు గ్రామసభలు నిర్వహించి పారిశుద్ధ్య కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. సమభావన సంఘాల మహిళలతో ఇంటింటికి వెళ్లి తడి, చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించాలని, పూర్తి కాని వైకుంఠ ధామాల పనులు పర్యవేక్షించి పూర్తి చేయాలని, వాటిని వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. నర్సరీ అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకతి వనాలలో కలుపు మొక్కలు లేకుండా చూడాలని, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని తెలిపారు. ఇంటినుండే కిరణా షాపులకు, మార్కెట్లకు వెళ్లే ముందు ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా క్లాత్ బ్యాగులు వినియోగించేలా చూడాలన్నారు. హోటల్స్, షాప్స్, మాల్స్ ముందు చెత్త వేస్తే జరిమానా విధించడం జరుగుతుందని తెలిసేలా దండోరా వేయించాలని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో చేపట్టిన కార్యక్రమాలపై ముందు, ఆ తర్వాత ఫోటో డాక్యుమెంటేషన్ చేయాలని ఆదేశించారు. శానిటేషన్ సిబ్బంది కి సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. గ్రామాల్లో చేపట్టిన రోజువారీ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.