Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ- నల్లగొండ
పోడు భూముల సమస్య పై ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కు కషి చేస్తోందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాటిల్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ,అటవీ అభివద్ధి అధికారులు,అటవీ సెక్షన్ అధికారులతో పొడు భూములు సమస్య పై కలెక్టర్ సమీక్షించారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం 2005 ప్రకారం అటవీ హక్కులకు అర్హులైన వారు సాంకేతిక కారణాలు,చిన్న చిన్న సమస్యలు, సమాచారం లేక దరఖాస్తు చేసుకొలేక పోయారన్నారు. జిల్లాలో 13 మండలాల్లో పొడు సమస్య ఉందన్నారు .పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారి నుండి నవంబర్ 8 నుండి డిసెంబర్ 8 వరకు దరఖాస్తులు స్వీకరించాలని,ఆర్ఓఎఫ్ఆర్కమీటీ లు స్వీకరించాలని అన్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి ఏర్పాటు చేయాలని అన్నారు. 15 మంది వరకు సభ్యులను కమిటీలో నియమించుకోవాలని, కోరారు. ఈ నెల 8 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల నుంచి ఆర్ఓఎఫ్ఆర్ గ్రామ కమిటీలు దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. అర్హతగల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, జిల్లా అటవీ శాఖ అధికారి రాం బాబు, ఆర్డివో లు రోహిత్ సింగ్(మిర్యాలగూడ),గోపి రాం (దేవర కొండ), అటవీ, రెవెన్యూ,పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొన్నారు.