Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తిరుపతి ఎంపీ గురుమూర్తి
అ గ్రీన్ ఇండిస్టీయల్ పార్క్ ను సందర్శించిన ఏపీఐఐసీ బందం
అ తెలంగాణ మోడల్ పార్క్‌లను ఆంధ్రాలోనూ నెలకొల్పుతాం
నవతెలంగాణ -చౌటుప్పల్‌రూరల్
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ పరిధిలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఇండిస్టియల్ మోడల్ పార్క్ అద్భుతంగా ఉందని తిరుపతి ఎంపీ గురుమూర్తు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఏపీఐఐసీ బందం స్టడీ టూర్ లో భాగంగా దండు మల్కాపురం ఇండిస్టియల్ పార్క్‌ను శుక్రవారం సందర్శించారు. ఏపీ నుండి వచ్చిన బందానికి టీిఎస్ఐసీసీ చైర్మెన్ గ్యాదరి బాలమల్లు,టిఐఎఫ్ అధ్యక్షులు కే సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు. ఇండిస్టియల్ పార్క్ లో నెలకొల్పిన లేఅవుట్, రోడ్లు డ్రైనేజీ వర్షపు నీరు డ్రైనేజీ సిస్టం కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇండిస్టియల్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం గ్రీనరీ ప్లాంటింగ్ తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మోడల్ గా ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఇండిస్టియల్ పార్క్ అద్భుతంగా ఉందన్నారు. ఇలాంటి పార్కులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి జగన్ దష్టి పెట్టారని తెలిపారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా నిర్మితమవుతున్న పార్కులను పరిశీలించడానికి స్టడీ బందాన్ని పంపించినట్టుపేర్కొన్నారు. పారిశ్రామిక అభివద్ధిలో తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. అదేవిధంగా టీిఎస్ఐసీసీ చైర్మెన్ గ్యాదరి బాలమల్లు మాట్లాడుతూ భవిష్యత్తులో దండు మల్కాపురం ఇండిస్టియల్ పార్క్ ను 1200 ఎకరాలకు విస్తరించి విధంగా కషి జరుగుతుందని తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కషి చేస్తున్నారని బంద సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బందం సభ్యులు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అరిమంద వరప్రసాద్ రెడ్డి, అరని ప్రశాంత్ కుమార్ రెడ్డి, యాదద్రి జోనల్ మేనేజర్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.