Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
నవతెలంగాణ - అర్వపల్లి
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు మండల కేంద్రంలో బుధవారం రాత్రి కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. నాగారం సీఐ రాజేష్ ఆధ్వర్యంలో 70 మంది పోలీసులు, 14 మంది ట్రైనీ ఎస్సైలు, ఇద్దరు ఎస్సైలతో పాటు మరికొంత మంది పోలీసులు పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 21 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు షాపుల్లోనూ సోదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ రాజేష్ మాట్లాడుతూ గ్రామాల్లో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలెవరూ భయపడొద్దని, కొత్త వారికి ఆశ్రయం కల్పించొద్దన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రస్తుతం గంజాయి అక్రమంగా రవాణా జరుగుతుందని, గంజాయి గురించి ఎవరికైనా సమాచారం అందితే తెలియజేయాలని కోరారు. ఆయన వెంట అర్వపల్లి ఎస్సై మహేష్, తిరుమలగిరి ఎస్సై లోకేష్ ఉన్నారు.
ఘనంగా దీపావళి
నవతెలంగాణ - కోదాడరూరల్
మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ గురువారం దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ బాంబులు పేల్చి నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో ఎంపీపీ చింత కవితరాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.