Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నార్కట్ పల్లి
భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆజాది కా అమత్ మహోత్సవం లో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మండలం లో వివిధ గ్రామ పంచాయతీలలో ఉచిత న్యాయ సేవా చట్టాలపై ఆదివారం అవగాహన కల్పించారు. నార్కట్ పల్లి లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ధనిక పేద తారతమ్యం లేకుండా అందరూ సమన్యాయం పొందే విధంగా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కల్లూరు యాదగిరి గౌడ్ పీఏసీఎస్ చైర్మెన్లు కసిరెడ్డి మధుసూదన్ రెడ్డి , సార యాదయ్య ,సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఆర్ వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి చెరుకు పెద్దలు మాజీ ఎంపీటీసీ గాలి నరసింహ హ, సీఓ వెంకటయ్య పి ఎన్ వి లు ఎండి షబీర్ హుస్సేన్ ఎండి.మహమ్మద్ అలీ, అద్దంకి శ్రీశైల చారి పులిజాల రమేష్ , ఎండి మహమ్మద్ అలీ, మీలా కిషోర్ సామాజిక కార్యకర్త షేక్ మన్సూర్ పాల్గొన్నారు.