Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మునుగోడు
మండలంలోని వెల్మకన్నే గ్రామంలో వర్షానికి కురుస్తున్న ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడీ కేంద్రంలోని గదులకు ఆదివారం గ్రామ సర్పంచ్ చలమల వెంకట్ రెడ్డి మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పాఠశాల బలోపేతానికి కషి చేస్తానన్నారు. ఇరవై రోజుల క్రితం పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దష్టికి తీసుకెళ్లామన్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలు , ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను అందించే సామర్థ్యం గల పాఠశాల ను తీర్చిదిద్దాలని తమ లక్ష్యమన్నారు .