Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
టీఎస్ యుటిఎఫ్ ఉపా ధ్యాయ ఉద్యమ బలోపే తానికి కృషి చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పేరుమల వెంకటేశం, జిల్లా కార్యదర్శి యాట మధుసూదన్ రెడ్డి కోరారు. ఆదివారం పట్టణంలోని ఆ సంఘం ప్రాంతీయ కార్యాలయంలో నకిరేకల్ మండల శాఖ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడంలో ఉపాధ్యాయులు ముందు ఉండాలన్నారు. ప్రభుత్వ విద్య రంగ పటిష్టత కోసం కషి చేయాలన్నారు. అనంతరం మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మహాసభలో టీఎస్ యుటిఎఫ్ ప్రతినిధులు పండుగ తిరుమలయ్య, సిహెచ్ రవీందర్, వేణుగోపాల్, కె నవీన్ రెడ్డి, కె విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు.
టీఎస్ యుటిఎఫ్ నకిరేకల్ మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా గంగాధర్ భద్రయ్య, ఉపాధ్యక్షులుగా తామస్ రెడ్డి, సిహెచ్ వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా సూరేపల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా శంకరయ్య, కార్యదర్శులుగా కె శ్రీనివాస్, వి శ్రీనివాస్, వై రాజేందర్ రెడ్డి, ఎస్ పద్మలత, నస్రత్ బేగం, సరిత, ఎస్ రామయ్య, ఆడిట్ కమిటీ కన్వీనర్ కె విద్యాసాగర్ రెడ్డి, సభ్యులుగా ఎం మల్లేష్, ఉపేందర్ రెడ్డి, వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ కన్వీనర్ కె బాలాజీ, అకాడమిక్ కన్వీనర్ టి శ్రీనివాస్, మహిళా కన్వీనర్ గా టీ సైదమ్మ, సోషల్ మీడియా కన్వీనర్ గా జి గోపయ్య, జిల్లా ప్రతినిధులుగా కె నవీన్ రెడ్డి, పండుగ తిరుమలయ్య, వేణుగోపాల్, నగేష్, కె మహాలక్ష్మి, సత్యనారాయణ, హరీష్ చంద్ర ఎన్నికయ్యారు.