Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మార్కెట్‌కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం కల్లాల వద్ద ఆరబెట్టి చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ఏ గ్రేడ్ రకానికి రూ.1960, కామన్ రకానికి రూ.1940 చొప్పున మద్ధతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, సింగిల్‌విండో ఛైర్మన్లు వెన్‌రెడ్డి రాజు, చింతల దామోదర్‌రెడ్డి, మున్సిపల్ వైస్చైర్మెన్్ బత్తుల శ్రీశైలం, మార్కెట్‌కమిటీ డైరెక్టర్లు పగిళ్ల సుధాకర్‌రెడ్డి, జక్కిడి సుమిత్రజయేందర్రెడ్డి, ఎమ్‌డి.చాంద్‌పాషా, సుర్కంటి నవీన్‌రెడ్డి, మంచికంటి భాస్కర్, నాంపల్లి అంజయ్య పాల్గొన్నారు.