Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్
నవతెలంగాణ- రామన్నపేట
వివిధ రంగాలలో పనిచేస్తున్న హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని పల్లివాడ గ్రామంలో ఫడరేషన్ సభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల మంది హమాలీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తున్న కార్మికులకు భద్రత సౌకర్యాలు కల్పించాలని, మౌలిక వసతులు కల్పించాలని, కూలీ రేట్లను రూ.60 నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 2021 ఏప్రిల్ నెలలో ప్రకటించిన అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డు విధివిధానాలను ప్రకటించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈశ్రం పోర్టల్లో ప్రతి కార్మికుని నమోదు చేసేందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, సీఐటీయూ జిల్లాసహాయ కార్యదర్శి మామిడి వెంకటరెడ్డి, బుడిద బిక్షం, గోరిగె సోములు, సర్పంచ్ సంద్యస్వామి, దండిగా అంజయ్య, జంగిలి రాములు, జాల రమేష్, తిరుమల సుదర్శన్, జాల ఐలయ్య, ఎడ్ల బొర్రయ్య , లింగయ్య, నాంపల్లి బిక్షమయ్య, సంకబుడ్డి మల్లయ్య పాల్గొన్నారు.