Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
మండలంలోని తుక్కపురం గ్రామంలో పీఏసీఎస్ ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్ గౌడ్, జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ కొల్పుల అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ నల్లమాస రమేష్ గౌడ్, ఎంపీపీ నరాల నిర్మల వెంకట స్వామి యాదవ్, జెడ్ పి టి సి సుబ్బురు బీరు మల్లయ్య, సింగిల్‌విండో చైర్మెన్ డాక్టర్ నోముల పరమేశ్వర్ రెడ్డి, సింగిల్‌విండో వైస్ చైర్మెన్ కెతావత్ మహేందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఆయా గ్రామాలలో పీఏసీఎస్్ కేంద్రాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాక వెంకటేశం టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పార్టీ సుధాకర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్‌్ కందాల భూపాల్ రెడ్డి, టీిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.