Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
మండలంలోని పెద్దకొండూరు గ్రామంలోని సాయి సేవ వద్దాశ్రమంలో చౌటుప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొనూరి రాంరెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్లో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సందర్భంగా సేవ కార్యక్రమాల్లో భాగంగా అన్నదానం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి యాదాద్రి సేవ ఆశ్రమం అధ్యక్షుడు అశోక్,ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పిసాటి నాగరాజురెడ్డి,ఉపాధ్యక్షులు ఎరసాని సతీష్, బొమ్మ మల్లేష్, సహాయ కార్యదర్శులు సిలువేరు శ్రీనివాస్, పల్లపు కష్ణ, కోశాధికారి శంకర్, ప్రచార కార్యదర్శి కొండమడుగు శ్రవణ్, ఉదరి శ్యామ్ సుందర్ ,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.