Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ మంత్రి చిన్నారెడ్డి
నవతెలంగాణ-బీబీనగర్
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే రానున్న రోజుల్లో రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రం వద్ద ఉన్న రైతులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోజుల తరబడి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నామని తెలపడంతో నాయకులు స్పందించి వెంటనే జిల్లా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా రైతు సమస్యలు తెలపగా కలెక్టర్ స్పందిస్తూ సోమవారం నుండి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు పొట్టోళ్ల శ్యామ్‌గౌడ్, నాయకులు బీర్ల అయిలయ్య, నర్సింహారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చెరుకు అచ్చయ్యగౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ గడ్డం బాలకష్ణగౌడ్, ఎంపీటీసీలు గోళి నరేందర్‌రెడ్డి, కొలను సత్యమణిశ్రీనివాస్రెడ్డి, టంటం భార్గవ్, సర్పంచ్ సురకంటి సత్తిరెడ్డి, నాయకులు చందునాయక్, రక్తని కష్ణ, సందిగారి బస్వయ్య, సోమ శివ పాల్గొన్నారు.