Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతుల గోస పడుతున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఆ పార్టీ మండల మహాసభ మండల కార్యదర్శి మొరిగాడి రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఆరోపణలు చేసుకుంటూ దొంగాట ఆడుతున్నాయన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని,పెరిగిన పెట్రోల్ ,డీజిల్ ధరలను తగ్గించాలని, నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుంటే రానున్న రోజులలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటాలు ఉధతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. అంతకుముందు మండల కమిటీ సభ్యులు సుధాగాని సత్య రాజయ్య జెండా ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పించారు. మండల కార్యదర్శి మొరిగాడి రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహులు,డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుగ్గ నవీన్, వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి జూకంటి పౌల్ , తూర్పుగూడెం మాజీ సర్పంచ్, మండల కమిటీ సభ్యులు దూపటి వెంకటేష్, జాలాపు లక్ష్మి , నలమాస తులసయ్య, సంగిరాజు , తదితరులు పాల్గొన్నారు.