Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
జిల్లా వ్యాప్తంగా కొనసాగు తున్న మెడికల్ మాఫి యాను ప్రభుత్వం అరికట్టా లని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుగ్గ నవీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .మండల కేంద్రంలో ఆదివారం ఆ సంఘం 41 వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పట్టణ అధ్యక్షులు ఎలగల శివ అధ్యక్షతన జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మెడికల్ మాఫియా విస్తరించిందని, గుర్తింపు పొందిన హాస్పిటల్స్, ఆర్ఎంపీ, జీఎంపీలు,గుర్తింపు లేని మెడికల్ షాపులు ఒక మాఫియాను ఏర్పాటు చేసుకుని ప్రజల వద్ద నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల ఉపాధ్యక్షుడు బోడ హనుమంత్, కోశాధికారి సిరిగిరి సారయ్య, మాజీ నాయకులు జూకంటి పౌల్, తీగల వెంకటేష్, పిక్క గణేష్, నాయకులు సురేష్, అమీద్, సంఘి రాజు, సుధాకర్, వాలి తదితరులు పాల్గొన్నారు.