Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
ఎన్ని ప్రభుత్వాలు మారినా మహిళల సమగ్ర అభివద్ధి జరగలేదని , మహిళలు గౌరవంగా బతికే రోజు రావాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి అన్నారు. ఆదివారం నల్లగొండ మండలంలోని జికె అన్నారం గ్రామంలో మహిళల అభివద్ధి పైన సమగ్ర సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ మహిళలకు గ్రామీణ ప్రాంతాలలో కనీస ఉపాది దొరకడం లేదన్నారు. కుటుంబ పోషణ జరగడం లేదని అర్ధాకలితో మహిళలు జీవిస్తున్నారని తమ సర్వేలో వెల్లడైందన్నారు.స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని కనీసం తిరిగి చెల్లించలేని పరిస్థితులు దాపురించాయన్నారు. మహిళల మధ్య ఘర్షణలు జరిగి అనేక కేసుల పాలైన పరిస్థితులు వచ్చాయని బ్యాంకర్లు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని పరువుతో ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు తమ దష్టికి వచ్చాయని అన్నారు. రాష్ట కమిటీ సభ్యురాలు కొండ అనురాధ మాట్లాడుతూ పొదుపు గ్రూపుల మహిళలందరికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని, ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్లు కొండ నాగమ్మ, భాగ్యమ్మ, సంధ్య,లక్ష్మి, చంద్రకళ, భ్రమరాంబ, సుమలత, శంకరమ్మ, సునీత, అక్షయ, అమూల్య, తదితరులు పాల్గొన్నారు.