Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
గ్రామాల రక్షణలో ప్రతిఒక్కరూ యూనిఫాం లేని పోలీసులు అని, గంజాయి రహిత జిల్లా కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలని ఎస్పీ ఎస్.రాజేం ద్రప్రసాద్ అన్నారు.ఆదివారం మండలపరిధిలోని బాలెంల గ్రామంలో సంగాని అనంత రాములు చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధికేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.ప్రభుత్వం రాష్ట్రంలో తాగు,సాగు నీటికి అధిక ప్రాధాన్యత నిచ్చి, ప్రజలకు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుందన్నారు.గ్రామానికి శుద్ధి చేసిన మంచి నీటిని అందించడానికి ముందుకు వచ్చి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన సంగాని అనంత రాములు చారిట్రబుల్ ట్రస్ట్ వారిని అభినందించారు.వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమ అనంతరం ఏర్పాటు చేసిన మహిళ-యువజన చైతన్యం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.జన్మభూమి, స్వగ్రామం రుణం తీర్చుకోవాలన్నారు.ఈ నెల 8న సూర్యాపేట పట్టణంలో జరిగే ఫ్రీఆర్మీ నియామక ర్యాలీలో జిల్లా యువత పెద్ద ఎత్తున పాల్గొని, దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలన్నారు.నూతన జిల్లాకు ఈ ఆర్మీ ర్యాలీ తేవడంలో మంత్రి జగదీశ్‌రెడ్డి చాలా కషి చేశారన్నారు. కల్నల్ సంతోష్‌బాబు ఆశయ సాధనకు కషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు మోహన్‌కుమార్, రవి, సారంగపాణి, సంగాని అంతరాములు చారిట్రబుల్ ట్రస్ట్ డైరెక్టర్ రజినీకాంత్, డాక్టర్ వందన,సర్పంచ్,ఎంపీటీసీ గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.