Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిరికొండ అనిల్‌కుమార్. ఎన్.సో మయ్య డిమాండ్ చేశారు.ఆదివారం పట్టణంలోని అంజలి స్కూల్లో ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యదర్శి ఆర్.రవీందర్ అధ్యక్షతన విద్యాసదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం అనేక సమస్యలతో కునారిల్లు తున్నదన్నారు.కరోనా సంక్షోభం తర్వాత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరన్నారు.ఉన్నత పాఠశాల సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉందన్నారు.పాఠశాలలో పారిశుధ్య పనులు నామమాత్రంగా జరుగుతున్నాయని తెలిపారు. సమస్య పరిష్కారంలో భాగంగా తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించి ఏడేండ్లుగా ఆగిపోయిన ప్రమోషన్లను వెంటనే ఇవ్వాలని, బదిలీలను వెంటనే చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పి. శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కోశాధికారి జి.వెంకటయ్య, ఆర్.రవీందర్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.సాంబయ్య నేరేడుచర్ల అధ్యక్ష కార్యదర్శులు పి.సైదులునాయక్, బి.అక్కయ్య, పాలకవీడు అధ్యక్ష కార్యదర్శులు ఆర్.శ్రీనయ్య, అందె సైదయ్య, గరిడేపల్లి అధ్యక్ష కార్యదర్శులు ఆర్.రాంబాబు,బి.నాగేశ్వర్రావు పాల్గొన్నారు.