Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో మద్యం షాపుల కేటాయింపులలో పారదర్శకత పాటిస్తామని కలెక్టర్ టి. వినరు కష్ణారెడ్డి అన్నారు.సోమవారం కలెక్టరేట్లో ఎక్సైజ్, సంబంధిత అధికారుల సమక్షంలో కలెక్టర్ డ్రా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం జిల్లా జనాభా ప్రాతిపాదికన ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5శాతం, గౌడ కులస్తులకు 15శాతం కేటాయింపులు జరుగుతా యన్నారు.జిల్లాలో 99 మద్యంషాపులు ఉండగా వాటిలో 40 షాపులలో ఎస్సీలకు 10, ఎస్టీలకు 3, గౌడ కులస్తులకు 27 షాపులకు కేటాయిస్తామన్నారు.మరో 59 షాపులు జనరల్ కేటాయింపులు చేయడం జరుగుతుందన్నారు.ఈ నెల 9నుండి ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్కేశవ్, ,సంక్షేమఅధికారులు శంకర్, దయానందరాణి, సీఐ శ్రీనివాస్, ఎస్సై సతీష్ పాల్గొన్నారు.