Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేట :సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ చెప్పారు.సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ కార్యాలయం నుండి నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. సైబర్ నేరాల పట్ల పోలీసు అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలో ట్రాఫిక్‌నిబంధనలు, వాహనచట్టాలను అతిక్రమించి వాహనదారులపై ట్రాఫిక్ ఈ-చలాన్ లు నమోదు చేస్తున్నట్టు వివరించారు.రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.ఫలితంగా పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించగలిగామని తెలిపారు.ఈ సమావేశంలో డీిఎస్పీలు మోహన్ కుమార్, రఘు,స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మునగాల సీఐ ఆంజనేయులు, సూర్యాపేట పట్టణ సీఐ ఆంజనేయులు, సూర్యాపేట రూరల్ సీఐ విఠల్‌రెడ్డి, కోదాడ పట్టణ సీఐ నర్సింహారావు, కోదాడరూరల్ సీఐ శివరాంరెడ్డి, హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి,సీసీఎస్ ఇన్స్పెక్టర్ నర్సింహ, ఏఓ సురేష్, సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, ఎస్సైలు శివ కుమార్, శ్రీనివాస్, రాంబాబు, డీసీఆర్బీ,కమ్యూనికేషన్, ఐటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పోలీసు గ్రీవిన్స్డేలో భాగంగా 13 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు.