Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్
నవతెలంగాణ-మిర్యాలగూడ
వానకాలం ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేసి వసతులు కల్పించినట్టు కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ అన్నారు. సోమవారం మిర్యాలగూడ రైతువేదికకేంద్రంలో టోకెన్ల జారీ ప్రక్రియ పరిశీలించిన అనంతరం మాట్లాడారు.వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 180 ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలుకేంద్రాలు ప్రారంభించా మన్నారు.120 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నట్టు తెలిపారు.నల్లగొండ నకిరేకల్ నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోలు కొనసాగుతున్నాయని, దేవరకొండ,మునుగోడులో ధాన్యం కొనుగోలు జరుగుతుందన్నారు.ధాన్యం కొనుగోలు మిల్లుల నిల్వ సామర్థ్యం, దిగుమతుల్లో జాప్యం లేకుండా రైతుకు వెసులుబాటు కోసం టోకెన్ల జారీ ప్రక్రియను చేపట్టామని, ప్రతి రైతుకు అందజేస్తామన్నారు.ఐదెకరాలు ఉన్న వారికి రెండు టోకెన్లు 10 ఎకరాలు ఉన్నవారికి 3 టోకెన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.ప్రతిరోజు టోకెన్లు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దన్నారు.ఆఖరి గింజ వరకు ధాన్యం కొంటామన్నారు.రైతువేదికల వద్ద ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టోకెన్లను అందజేస్తామన్నారు.రైతులు దళా రులను ఆశ్రయించొద్దని, మద్దతుధర అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.తేమ 17 శాతం కంటే తక్కువ ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టిన ధాన్యాన్ని తెచ్చి మద్దతుధర పొందాలని కోరారు.డిసెంబర్ నాటికి వానాకాలం సీజన్ ధాన్యాన్ని కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామ న్నారు.ఈ సమావేశంలో ఆర్డీవో రోహిత్‌సింగ్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఏడీఏ పోరెడ్డి నాగమణి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మీ, ఏఓ కల్యాణ్‌చక్రవర్తి, ఏఏఓలు పాల్గొన్నారు.