Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోతె
మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ ముప్పాని ఆశశ్రీకాంత్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండలపరిషత్ సర్వసభ్యసమావేశం రసాభాసగా కొనసాగింది.సమావేశం ప్రారంభం కాగానే మండలంలోని అన్ని గ్రామాల్లోనూ విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ప్రజాప్రతినిధులు సమా వేశం దృష్టికి తీసుకొచ్చారు. మండలంలోని 9 కొత్త రేషన్ దుకాణాలు మంజూ రయ్యాయని, 332 కార్డులు మంజూరయ్యాయని సంబంధిత అధికారి పద్మజ తెలిపారు.ఇరిగేషన్ ఏఈ, పీఆర్ ఏఈ సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారు.గురుకుల పాఠశాల మంజూరు కోసం సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు.పశు వైద్యశాఖలో నూతనంగా ఫైలెట్ ప్రాజెక్టు మంజూరైనట్టు సంబంధిత అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.మండల రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.కొంతమంది అధికారులు, సర్పంచులు హాజరుకాకపోవడం గమనార్హం.ఈ సమావేశంలో జెడ్పీటీసీ పుల్లారావు, పీఏసీఎస్ చైర్మెన్ కొండపల్లి వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ శంకర్‌రెడ్డి, సూపరింటెండెంట్ వెంకటాచారి, ఎంపీఓ హరిసింగ్ పాల్గొన్నారు.