Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాకేంద్రంలోని మన్నా మినిస్ట్రీస్ చైర్మన్ బిషప్ సుదర్శన్ జ్యోతి కోమనపల్లి,,బిషప్ రేచల్ జ్యోతి కోమనపల్లి,బిషప్ ఆర్డినేషన్,అభిషేకం పొందిన బిషప్ సిహెచ్. సాల్మాన్ రాజు దంపతులను జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ పక్షాన ఘనంగా సన్మానించినట్లు ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు బిషప్. డా.దుర్గం ప్రభాకర్ వెల్లడించారు.సోమవారం జిల్లాకేంద్రం లోని మన్నా చర్చ్ ఆవరణలో ప్రభాకర్ ఆధ్వర్యంలో వారిని శాలువాలు,బొకేలతో సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏండ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో దేవుని సేవలను అందిస్తున్నారని కొనియాడారు.ఆనాధ పిల్లలను చేరదీసి వారికి విద్యను అందిస్తూ అనేక సంఘాలను నెలకొల్పి కొన్ని వేల ఆత్మలను రక్షించినట్టు స్పష్టం చేశారు. సూర్యాపేటలోని స్వతంత్ర దైవ జనులకు అండగా ఉంటూ సేవకులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చార్లెట్ హోం వ్యవస్థాపక అద్యక్షులు జె.డేవిడ్రాజు,సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డా.ముల్లంగి జాకబ్రాజు, వరికుప్పల మత్తయి, డి.జాన్ప్రకాష్, పి.బోయజు,సైదులు పాల్గొన్నారు.