Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
అధిక పాల దిగుబడి కోసం మేలుజాతి పశుసంపదను అభివృద్ధి పర్చుకోవాలని రైతులకు జిల్లా లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్య నిర్వహణాధికారి డాక్టర్ రావిరాల మల్లికార్జున్ సూచించారు. దేవరకొండ మండలం మర్రిచెట్టుతండాలో సోమ వారం డీఎల్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గర్భకోశవ్యాధుల చికిత్సా శిబిరాన్ని ప్రారంభించి రైతులతో మాట్లాడారు.కత్రిమ గర్భధారణ పద్ధతిలో ఆవులు, గేదెల్లో మేలు జాతి పశుసంపదను పొందొచ్చన్నారు.స్థానికంగా ఉండే నాసిరకం కోడెలు, గేదె దున్నలతో ప్రత్యుత్పత్తి చేసుకోవడం వల్ల గర్భకోశ వ్యాధులు సంభవిస్తాయన్నారు.లోకల్ బ్రీడ్ కోడెలకు మార్కెట్లో రూ.30 వేలకు మించి విలువ ఉందని, కత్రిమ గర్భదారణ వల్ల జన్మించే ఒంగోలు జాతి కోడెలకు ఐదేండ్ల వయస్సుకే రూ.లక్ష విలువ ఉంటుందన్నారు. కార్యక్రమంలో దేవరకొండ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఇందిర, మండల పశువైద్యాధికారి డాక్టర్ జి.నాగయ్య, వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ నేనావత్ శ్రీనునాయక్, ఉపసర్పంచ్ శ్రీనునాయక్, డీఎల్‌డీఏ సూపర్వైజర్ చిరుమర్తి రవికిరణ్, పి.వేణు, గోపాలమిత్ర నాయకులు పల్స మహేష్, ఎ.శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.