Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
మండలంలోని వరి కొనుగోలుకేంద్రాల ప్రారంభోత్సవానికి ఎం ఎల్ సమయం ఇస్తేనే ప్రారంభిస్తామని అధికారులు చెప్పడం సిగ్గుచేటని బీజేపీ నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్చార్జి కంకణాల నివేదితరెడ్డి ఆరోపించారు.సోమవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యపురాశులను పరిశీలించి మాట్లా డారు.కొనుగోలుకేంద్రంలో ధాన్యాన్ని ఆరబెట్టడానికి ఎటువంటి సౌకర్యాలు లేవని, ముందస్తుగా ఇక్కడ చెట్లను తొలగించలేదన్నారు.కొనుగోలుకేంద్రంలో రైతులకు 40 కేజీల బస్తాకు 14 రూపాయలు హమాలి కూలి రైతుల నుండి తీసుకుంటున్నారని ఆరోపించారు.అయితే దీనికి సంబంధించి ఏడు రూపాయల ప్రభుత్వం తిరిగి చెల్లించడం జరుగుతుందన్నారు.ఈ రూ.7 రైతుల అకౌంట్లో జమకావడం లేదన్నారు.అధికారులు, అధికార పార్టీ నాయకులు కొన్నేండ్లుగా రైతుల డబ్బులను వాడుకుంటున్నట్టు తెలిపారు.అనంతరం రైతులు నివేదితరెడ్డికి తమ బాధలను విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ఏరుకొండ నర్సింహ, మండల గిరిజన నాయకులు పాల్తీ శంకర్, మండలనాయకులు సల్వాది గోవింద్, యువమోర్చా అధ్యక్షుడు చిట్టిమల్ల శివ, సంగారం బూత్ అధ్యక్షులు ఏరుకొండ తిరుపతి పాల్గొన్నారు.