Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ ఆర్టీసీ డిపోను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) ఈ. యాదగిరి సోమవారం సందర్శించారు.డిపోను, బస్‌స్టేషన్‌ను పరిశీలించిన అనంతరం సంస్థ ఉద్యోగులతో మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగి నుంచి ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు సంస్థ నష్టపోయిన సందర్భంలో సంస్థ ఉద్యోగులు కష్టపడి, నిబద్ధతతో పనిచేసి మళ్లీ లాభాల బాట పట్టించారని గుర్తుచేశారు. కాబట్టి సంస్థ మనుగడ బాగుంటేనే మనందరం బాగుంటామన్నారు. మన దేవరకొండ డిపోకు రాష్ట్ర స్థాయిలో మంచిపేరు ఉందని, గతంలో డిపోకు ఎన్నో అవార్డులు వచ్చాయని, దేవరకొండ డిపో రాష్ట్రంలోనే రెండవ స్థానంలో ఉందని, మీరందరూ ఇలాగే కష్టపడి ప్రయాణీకులకు మెరుగైన సేవలందిస్తూ.. లాభాల బాట పట్టిస్తూ.. డిపోను మొదటి స్థానంలో నిలపాలని కోరారు. డిపోను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అన్ని విధాలా మీ వెంట మేము ఉంటూ సహాయ సహకారాలందిస్తామని, కష్టపడేవారికి ఎప్పుడూ గుర్తింపు తప్పక ఉంటుందని, రాబోయే మూడు నాలుగు నెలల్లో ముందజలో ఉంచాలని సూచి ంచారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలందిస్తే వారు ఎల్లవేళలా సంస్థకు సహకరిస్తారని, మన నడవడిక బాగుండాలని సూచించారు. హైదరాబాద్ నుండి దేవరకొండ వరకూ ఆయన బస్సులోనే ప్రయాణం చేశారు. తిరుగు ప్రయాణంలో కూడా బస్సులోనే బయలుదేరి వెళ్లారు. ఆనయ వెంట డిప్యూటీ సీటీఎం మధుసూదన్, డీఎం రాజీవ్ ప్రేమ్‌కుమార్, అసిస్టెంట్ మేనేజర్ సైదులు, డిపో ఉద్యోగులు ఉన్నారు.