Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరిరూరల్
మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పోతురాజు రజిని రాజశేఖర్ అధ్యక్షతన సోమ వారం సాధారణ సమావేశం నిర్వహి ంచారు. సమావేశానికి ఎమ్మెల్యే డా.గాదరి కిషోర్‌కుమార్ హాజర య్యారు.సమావేశంలో మున్సి పాలిటీకి సంబంధించిన ఎజెండా లోని అంశాలు మున్సిపల్ ఆఫీస్, షాపింగ్ కాంప్లెక్స్ కోసం నిధులు, మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులో సీసీరోడ్ల నిర్మాణం, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నిధుల నుంచి మున్సిపాలిటీకి వైకుంఠరథం, శానిటేషన్ మురికి కాలువలు, పూడికతీత, మొదలగు కార్యాలయాల పనులకోసం జేసీబీ వాహనం, చెత్త సేకరణకు వాహనం తదితరఅంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ సంకెపల్లిరఘునందన్రెడ్డి,కమిషనర్ శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు,అధికారులు పాల్గొన్నారు.