Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
భావితరాలకు మన సనాతన ధర్మాన్ని తెలియజేయడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడమే సదాచార్ ట్రస్ట్ లక్ష్యమని కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల సదాచార్ ట్రస్ట్ సేవా మందిరంలో ఆర్థికంగా వెనుకబడిన తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన పాల శ్రావణి,రామన్నగూడెంకు చెందిన గౌని రజిత ల వివాహా నిమిత్తం ట్రస్ట్ సభ్యులు మిర్యాల శివకుమార్,కవిత దంపతుల సహకారంతో ఇద్దరికి మంగళ సూత్రములు,మట్టెలు అందజేశారు.ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వారు వివాహం చేసుకునే వధువు పెండ్లి పత్రిక, ఆధార్ కార్డ్,తెల్ల రేషన్ తో మా కార్యాలయంలో ముందుగా సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సదాచార్ ట్రస్ట్ సభ్యులు మిర్యాల శివకుమార్, కవిత,ఈగ విజయలక్ష్మీ, బొల్లం రమేశ్, బచ్చు పురుషోత్తం పాల్గొన్నారు.