Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
సూర్యాపేట మండలంలోని గల వజ్ర రైస్ ఇండిస్టీలో తొలగించిన హమాలీలను వెంటనే పనిలోకి తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలెంల గ్రామ పరిధిలో గతంలో ఉన్న స్వరూప రైస్‌మిల్లులో పనిచేస్తున్న హమాలీ కార్మికులను యాజమాన్యం మారగానే పనిలో నుండి తొలగించడం అన్యాయమన్నారు.స్థానికంగా ఉన్న పరిశ్రమలో, రైస్ ఇండిస్టీల్లో స్థానికులకే పని అవకాశం కల్పించాల్సి ఉన్నా అమలుచేయకపోవడం దుర్మార్గమన్నారు. రైస్‌మిల్లులలో కార్మికుల హక్కులను కాలరాసే విధంగా యాజమాన్యాలు వ్యవహరించడం సరికాదన్నారు.ఏండ్ల తరబడిగా పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నా కార్మికుల పొట్టకొట్టడం మానుకోవాలని హెచ్చరించారు. వెంటనే హమాలీలను పనిలో నుండి తొలగించిన విషయంలో కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకుని తిరిగి వారిని పనిలోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో ఏఓ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి,సీఐటీయూ జిల్లా నాయకులు మామిడి సుందరయ్య, పాముల సీతారాములు, హమాలీలు పాల్గొన్నారు.సందీప్, నరేష్ మహేష్, వెంకన్న, వేల్పుల మహేష్ పాల్గొన్నారు.