Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు పీఆర్సీ ప్రకారం వివిధ కేటగిరీల వారీగా కార్మికులకు పెరిగిన వేతనాలు వెంటనే ఇవ్వాలని సీఐటీయూ పట్టణ నాయకులు మామిడి సుందరయ్య, సీపీఐ(ఎం)టూ టౌన్ కార్యదర్శి కోట గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం మున్సిపల్ కార్మికుల సమస్యలపై రాష్ట్రవ్యాప్త ధర్నాలో భాగంగా మున్సిపల్ కార్మికులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ప్రభుత్వం పీఆర్సీ ప్రకారం పెంచిన వేతనాలను అమలుచేయడంలో జాప్యంచేయొద్దన్నారు.హుజూరాబాద్, జమ్మికుంట, వరంగల్ మున్సిపాలిటీల్లో కౌన్సిల్ తీర్మానాలు చేసి కార్మికులకు పెరిగిన వేతనాలిస్తున్న విధంగానే సూర్యాపేట మున్సిపాలిటీలో కూడా ఇవ్వాలన్నారు.అవుట్ సోర్సింగ్ కార్మికులకు బట్టలు, చెప్పులు,కొబ్బరి నూనె,గ్లౌజ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.పారిశుధ్య కార్మికులు చేస్తున్న పని మూలంగానే అవార్డులు పొందుతున్న మున్సిపల్ పాలకవర్గం వారి సమస్యల పట్ల శ్రద్ధ చూపకపోవడం తగదన్నారు.పారిశుద్ధ కార్మికులపై మున్సిపల్ అధికారులు వేధింపులకు పాల్పడడం మంచిది కాదన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు చాగంటి వెంకటరమణ,ఓగోటి దశరథ,వల్దాస్ మధుసూదన్, బండారి మురళి,కాసర్ల లింగయ్య, ముదిగొండ ఎల్లమ్మ,సల్మాన్, మామిడి వెంకన్న,శివ, భిక్షం, చంటి, నర్సమ్మ పాల్గొన్నారు.