Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిటౌన్
మహిళలకు ఉపాధిలేక నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో అర్ధాకలితో అనారోగ్యంతో జీవిస్తున్నారని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ అన్నారు. మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో మహిళల సమస్యలపై సమగ్ర సర్వే నిర్వహించారు. అ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మైక్రోఫైనాన్స్ ల ద్వారా రుణాలు తీసుకోని, అవి సరైన సమయానికి కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు దాసరి మంజుల, జిల్లా ఉపాధ్యక్షురాలు కొండమడుగు నాగమణి, నాయకురాలు హేమలత, తాడూరి కలమ్మ, మంజుల, అంజని తదితరులు పాల్గొన్నారు.