Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ కోరారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ దశరధ నాయక్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 28 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మార్కెట్లో ధాన్యం పోసి 50 రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రారంభించలేదనిన్నారు. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అంజి రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం కూడా రైతుల ధాన్యం వెంట వెంటనే కొనుగోలు చేయకపోవడంతో ధాన్యాన్ని ఆయా కేంద్రాలలో నిల్వ చేసుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ సంవత్సరం కూడా అలాంటి సమస్యలే రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోట రామచంద్రారెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు, పట్టణ కమిటీ సభ్యులు పగడాల శివ , దుబ్బాక జగన్, రామస్వామి అనిల్ రెడ్డి, సత్తిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.