Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
పోడు భూములను సాగుచేసుకుంటున్న గిరిజనులు, రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు మంగళవారం సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరు నర్సిరెడ్డి, కల్లూరు మల్లేశ్, జిల్లా కమిటీ సభ్యులు రోడ్డ అంజయ్య ,చౌటుప్పల్ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు మండల కమిటీ సభ్యులుకష్ణలతో కూడిన బందం కడీలబాయి తండాను సందర్శించారు. పోడు భూముల సమస్యలపై దరఖాస్తులు ఇస్తున్న గిరిజనులతో మాట్లాడరు. వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. 260 దరఖాస్తులు ప్రభుత్వం వారుపంపిణీ చేయగా 40 మంది మాత్రమేభూములు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ వామపక్ష పార్టీలుముఖ్యంగా సిపిఐ(ఎం)చేసిన పోరాట ఫలితంగ పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. భూమి పంపిణీ కార్యక్రమంలో అధికార్లు ప్రజా ప్రతినిధులు నిష్పక్షపాతంగా వ్యవహరించి అర్హులైన వారికిభూములు అందేలా చూడాలని డిమాండ్ చేశారు.ఎట్లాంటి పైవరీలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు.ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం గా పోడు భూముల సమస్యలనుపరిష్కారం చేయాలన్నారు. ప్రభుత్వం స్థలంలో ఇల్లు నిర్మాణం చేసుకున్న వారికీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు పరిష్కారం చూపకుంటే పెద్ద ఎత్తున పోరాటాలకుసన్నద్ధం కావాలనిపిలుపునిచ్చారు.