Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -ఆలేరుటౌన్
టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మెన్ ,ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డికి చౌటుప్పల్ శాఖలో డిపాజిట్ల సేకరణ మహోత్సవంలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఖాతాదారులతో మాట్లాడి ఖాతాలు ఇప్పించారు. బ్యాంకు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేటాయించిన డిపాజిట్ల టార్గెట్స్‌ను పూర్తిచేయాలని దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు, కార్యకర్తలు పాల్గొన్నారు .