Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఆర్డీఓ కలిందిని
నవతెలంగాణ -నార్కట్పల్లి
రైతులు తాలు, మట్టి పెళ్లలు, చెత్తాచెదార లేకుండా ఆర పెట్టుకొని నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని డీఆర్డీఓ కళిందిని పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని తొండ్లాయి, అక్కెనపల్లి , జువ్వి గూడెం, బివెల్లంల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించి మాట్లాడారు. నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. రానున్న రెండు రోజులు వర్ష సూచన ఉండడంతో ధాన్యంపై టార్పాలిన్లు కప్పి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు ను సీరియల్ ప్రకారం కొనుగోలు చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. ధాన్యం కొనుగోలు నివేదికను ఎప్పటికప్పుడు జిల్లా కార్యాలయాలకు పంపించాలని ఆదేశించారు. ధోన్యం కాటా వేసేటప్పుడు రైతులకు ఓటీపీ వస్తుందని ఆ వచ్చిన నెంబర్ ను కమిటీ సభ్యులకు తెలియజేయాలని తద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గిరి ప్రసాద్ , డీపీఎం అరుణ్ కుమార్ , సేర్ఫ్ ఏ పీిఎం ఓగోటి కష్ణ, సీసీలు అహ్మద్ దున్నీసా బేగం, జ్యోతి, రమాదేవి, వివో ఏలు అశోక్ , సుమలత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.